ధూమ్ 3తో పాటు రానున్న నాని ‘ఆహా కళ్యాణం’ టీజర్

Nani
బాలీవుడ్ లో విజయం సాధించిన ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా రీమేక్ ని యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతోంది. తమిళంలో నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగులో డబ్ చేయనున్నారు. ఈ సినిమాకి ‘ఆహా కళ్యాణం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని ధూమ్-3 సినిమాతో పాటుగా థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు.

హైదరాబాద్ లో ధూమ్ 3 ప్రమోషన్స్ కోసం వచ్చిన ఉదయ చోప్రా ఈ వార్తని ఖరారు చేసాడు. నాని సరసన వాని కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోకుల్ డైరెక్టర్. యష్ రాజ్ ఫిల్మ్స్ మొట్ట మొదటి సారిగా సౌత్ ఇండియాలో నిర్మిస్తున్న సినిమా ఇది.

Exit mobile version