ఒకానొక సమయంలో తెలుగు ఫిల్మ్ మ్యూజిక్ బిజినెస్ లో లహరి మ్యూజిక్ సంస్థ తారా స్థాయిలో దూసుకోపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా మిగతా అన్ని సంస్థలతో పోటీ పడటంలో కాస్త వెనుకబడింది. లహరి మళ్ళీ తన స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటోంది. అందుకోసం వారు ప్రస్తుతం తమ ఆశలన్నే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ ఆడియోపైనే పెట్టుకున్నారు.
మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లహరి మ్యూజిక్ వారు ‘1-నేనొక్కడినే’ సినిమా ఆడియో రైట్స్ ని 70 లక్షలకి సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో ఇంత పెద్ద అమౌంట్ కి అమ్ముడు పోయిన వాటి లిస్టులో 1 కూడా చేరింది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని ఈనెల 19న రిలీజ్ చేయనున్నారు.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలోమహేష్ బాబు సరసన కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు.