నిత్యా 27న మాలిని గా రానుందా?

malini-22
ఇండస్ట్రీలో వినిస్తున్న సమాచారం ప్రకారం నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మాలిని 22’ సినిమా డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో క్రిష్ సత్తార్, నరేష్, కోవై సరళ, రమణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో రిలీజ్ అయ్యింది, అలాగే ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మలయాళంలో వచ్చిన 22 ఫీమేల్ కొట్టాయం సినిమా మాలిని 22 రీమేక్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమాని 40 రోజులలోపే షూటింగ్ పూర్తి చేసారు. ‘ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ మేసేజ్ ఉంటుంది. అలాగే ఎంటర్టైనింగ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం సొసైటీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకునే విషయంలో అందరికీ స్ఫూర్తి ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని’ శ్రీ ప్రియ తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని రాజ్ కుమార్ సేతుపతి నిర్మించాడు.

Exit mobile version