చివరి దశకు చేరుకున్న వివి వినాయక్ మూవీ జపాన్ షెడ్యూల్

VV-Vinayak

వివి వినాయక్ మరియు అతని టీం ప్రస్తుతం జపాన్ లో షూటింగ్ చేస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఇటీవలే ఈ చిత్ర టీం ఓ సాంగ్ కోసం టోక్యో వెళ్ళింది. మేము విన్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం టోక్యో నుండి జపాన్లోని మరో లొకేషన్ కి షిఫ్ట్ అయ్యింది.

ఈ రోజుటితో జపాన్ షెడ్యూల్ కూడా పూర్తి కానుందని సమాచారం. ఈ చిత్ర యూనిట్ ఈ పాటని టోక్యోలోని పలు అందమైన ప్రదేశాల్లో మరియు జపాన్లోని పలు ప్రాంతాల్లో షూట్ చేసారు. ఈ చిత్ర టీం అక్కడి చల్లని వాతావరణ పరిస్థితుల వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ షూటింగ్ ని కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా సమంత కూడా షూటింగ్ లొకేషన్ చాలా చల్లగా ఉందని ట్వీట్ చేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కి చోట కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

Exit mobile version