27న నా రాకుమారుడు విడుదల

naa_rakumarudu
నవీన్ చంద్ర, రీతూ వర్మ నటించిన ‘నా రాకుమారుడు’ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సినిమా నవంబర్ ఆఖరివారంలో విడుదలకావాల్సివుండగా కొన్ని కారణాలవలన వాయిదాపడింది. సత్య దర్శకుడు.పి వజ్రంగ్ ఈ చిత్రాన్ని హరివిల్లు క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు

ఈ సినిమా సెన్సార్ బోర్డ్ నుండి యు సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. అమ్మాయిలను ద్వేషించే యువకుడిగా ఈ సినిమాలో కనిపిస్తున్న నవీన్ చంద్ర గతంలో అందాల రాక్షసి, దళం సినిమాలలో నటించాడు. “నేను ఈ సినిమాలో ఏదో కొత్తగా చెయ్యాలనుకున్నా. తన కుటుంబం, చదువు గురించి మాత్రమే ఆలోచించే పాత్ర నాది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా” అని సంభాషించాడు

అచ్చు సంగీతం అందించాడు. కుమార స్వామి సినిమాటోగ్రాఫర్

Exit mobile version