కృష్ణవంశీ – నానిల ‘పైసా’కి ‘ఏ’ సర్టిఫికేట్

paisa_movie_stills_nani_cat

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ యంగ్ హీరో నాని కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘పైసా’. ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ విషయాన్ని నాని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘పైసా సినిమాకి సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలా రావడం నా కెరీర్లో మొదటిసారి. స్కూల్ లో కూడా ఎప్పుడు ‘ఏ’ రాలేదు. ఈ విషయంలో నా తల్లితండ్రులు గర్వంగా ఫీలవుతారని’ ట్వీట్ చేసాడు.

నాని సరసన కేథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎక్కువ పొలిటికల్ ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాని ప్రకాష్(డబ్బు పిచ్చి గల) కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సిద్దిక వర్మ, చరణ్ తేజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి కార్తీక్ కంపోజ్ చేసిన ఈ చిత్ర ఆడియో చాలా రోజుల క్రితం విడుదలైంది. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version