‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాతో సుమంత్ మనముందుకు రానున్నాడుథాయ్ నటి పింకీ సావిక ఈ సినిమాలో హీరోయిన్. ఈమె ప్రతిభతో, ఈమె కనబరిచిన నటనతో చిత్ర బృందం ఆనందంగా వున్నారు.
ఒక వార్తాపత్రికకు దర్శకుడు చంద్ర సిద్ధార్ధ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో “పింకీ వలన థాయ్ ల్యాండ్ లో మాకు చాలా ఖర్చు తగ్గింది. అక్కడ పర్యాటక శాఖతో ఆమెకు ఉన్న సంబంధాల వలన మంచి లోకేషన్లలో రూపాయి ఖర్చు లేకుండా షూటింగ్ జరుపుకున్నాం” అని తెలిపారు
కీరవాణి అందించిన సంగీతం త్వరలో విడుదలకానుంది. ఎస్.ఎస్ కంచి స్క్రిప్ట్ పనులు చూసుకున్నారు. ఆయన ఇందులో చిన్న పాత్ర కూడా పోషించడం కొసమెరుపు. పూదోట సుధీర్ కుమార్ నిర్మాత