నాని మాస్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్

Janda-Pai-Kapiraju-(1)
రైజింగ్ హీరో నానికి యూత్ ఫుల్ మరియు క్లాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. దానికి భిన్నంగా నాని తన కెరీర్లో మొదటి సారిగా తన రాబోయే ‘జెండాపై కపిరాజు’ సినిమాలో అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి అరవింద్ శివ కృష్ణ పాత్ర అయితే, రెండవది మయ కన్నన్.

జెండాపై కపిరాజు సినిమాలో తన రెండు పాత్రలకి సంబందించిన రెండు పోస్టర్స్ ని నాని ఈ రోజు రిలీజ్ చేసాడు. ఈ రెండింటిలో మయ కన్నన్ పాత్రలోని నాని మాస్ లుక్ కి సోషల్ నెట్వర్క్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని డైరెక్టర్.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెఎస్ శ్రీనివాసన్ నిర్మాత. నాని ఈ సినిమాతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మాస్ హిట్ కొడతాడంటారా? మయ కన్నన్ పాత్ర తనలోని మాస్ యాంగిల్ ని చూపించడానికి నానికి సరైన అవకాశం. సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేదాని కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

Exit mobile version