మన దగ్గర వున్న వస్తువులో విషయం వుంటే ఎలాంటి అవరోధాలు వాటిని విజయం నుండి ఆపలేవు. ఈ వాక్యానికి ‘ఆటోనగర్ సూర్య’ సినిమా సరిగ్గా సరిపోయే ఉదాహరణ. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎప్పుడో విడుదలకావల్సివున్నా నిర్మాణ కష్టాల వలన విడుదలకు జాప్యం జరిగింది.
కాకపోతే ఇప్పుడు అవన్నీ గతంలో కలిసిపోయాయి. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. ఇటీవలే నాగచైతన్య జన్మదిన కానుకగా ఈ సినిమా టీజర్ విడుదలచేశారు. దానికి తక్కువ సమయంలోనే మంచి ప్రశంసలు అందాయి
రోజు రోజుకూ అంచనాలు పెరుగుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్. దేవ కట్టా దర్శకుడు. ఆర్.ఆర్ మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది