ఆట ఆరంభంకి డబ్బింగ్ కంప్లీట్ చేసిన రానా

daggubati-rana
టాలీవుడ్ యంగ్ హంక్ దగ్గుబాటి రానా తమిళ సూపర్ స్టార్ అజిత్ తో కలిసి ‘ఆరంభం’ సినిమాలో నటించాడు. ఈ సినిమాని తెలుగులో ‘ఆట ఆరంభం’ రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రానా దగ్గుబాటి తన పాత్రకి డబ్బింగ్ పూర్తి చేసాడు. ఆర్య, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించాడు.

ఈ భారీ బడ్జెట్ సినిమాని జి. శ్రీను బాబు ఆంధ్ర ప్రదేశ్లో రిలీజ్ చేస్తున్నారు. యువన్ శంకర్ రాజ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. తమిళంలోలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నారు.

Exit mobile version