ఉదయభానుపై ఫిర్యాదు చేస్తానంటున్న డైరెక్టర్

uday-bhanu
ప్రముఖ టీవీ యాంకర్ అప్పుడప్పుడు సినిమాల్లో లేదా స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఉదయ భాను ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మధుమతి’. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. కానీ ఈ ఆడియో వేడుకకి ఉదయభాను హాజరుకాకపోవడంతో ఈ చిత్ర దర్శకుడు రాజ్ శ్రీధర్ ఆమెపై మండిపడుతున్నాడు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ లో చాలా ముఖ్యమైన ఆడియో విడుదలకి హాజరు కానందువల్ల ఆయన మూవీ ఆర్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నాడు.

అలాగే ఈ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేస్తానని చెయ్యలేదు చివరి నిమిషంలో చేసేదేమీ లేక వేరే అమ్మాయితో ఆ సాంగ్ షూట్ చేసామని రాజ్ శ్రీధర్ వాపోతున్నాడు. రాజ్ కిరణ్ సంగీతం అందించిన ఈ సినిమాని రాణి శ్రీధర్ నిర్మించింది.

Exit mobile version