తమిళంలోకి ఎంటర్ అవుతున్న మరో యంగ్ హీరో

Tamil
ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోస్ అయిన అల్లరి నరేష్, నాని, సందీప్ కిషన్, అల్లు శిరీష్ ఇలా పలువురు హీరోలు తమిళంలో కూడా సినిమాలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతం వారిబాటలోనే హీరో నిఖిల్ కూడా తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

ప్రస్తుతం నిఖిల్ హీరోగా, స్వాతి హీరోయిన్ గా ‘కార్తికేయ’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని తమిళ్ లో కూడా షూట్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ కి సంబందించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు చెన్నై ఏవియం స్టూడియోలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హీరో జయం రవి, ఎడిటర్ మోహన్ అతిధులుగా హాజరయ్యారు.

ఇప్పటికే తెలుగులో కొంత భాగాన్ని షూట్ చేసిన టీం ఇక నుంచి తమిళం మరియు తెలుగులో చిత్రీకరణ జరిపి సినిమాని ఒకేసారి రెండు భాషల్లో రిలీజ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. చందు డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర డైరెక్టర్.

Exit mobile version