‘అఖండ 2’ కోసం ఊహించని అతిథులు!?

Akhanda 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కి ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసారు. ఇక నెలాఖరులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా లాక్ చేసినట్టుగా టాక్ వచ్చింది.

మరి ఈ ఈవెంట్ కోసం ఊహించని అతిథులు వస్తారనే రూమర్స్ ఇపుడు కొనసాగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరినీ ఒకే వేదికపై మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఇది ఎంతవావరకు నిజమో కానీ ప్రస్తుతం అయితే సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టేస్తుంది. మరి దీనిపై మేకర్స్ నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version