మైత్రీ నిర్మాత డేరింగ్ స్టేట్మెంట్

రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్ర కన్నడ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం బెంగళూరులో ఘనంగా జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన మైత్రి నిర్మాత రవి శంకర్ డేరింగ్ స్టే్ట్మెంట్ చేశారు.

“రిషబ్ శెట్టితో జై హనుమాన్ చేస్తున్నాం. కాంతారా తర్వాత ఆయన నుంచి రాబోయే చిత్రం ఇదే. ఇంకా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ సినిమా చేస్తున్నాం. అది ఇప్పటికే షూటింగ్‌లో ఉంది. పెద్దీ 2026 మార్చిలో వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్ 2026కి సిద్ధమవుతోంది. ప్రభాస్‌తో ఫౌజీ చేస్తున్నాం. ఇవన్నీ బలమైన కథలతో వస్తున్న చిత్రాలే. ఈ ఐదు సినిమాల్లో ఒక్కటి యావరేజ్ అయినా మీరు చెప్పిందే నేను చేస్తాను” అని రవి శంకర్ మీడియా, అభిమానులతో ఛాలెంజ్ చేశారు.

ఇప్పుడు మైత్రి బ్యానర్ భారీ బడ్జెట్ చిత్రాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. రవి శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాయి. 2026లో ఈ భారీ సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్లను అందిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

Exit mobile version