‘ఇన్సెప్షన్’ కి ‘కొదమసింహం’ కి లింకేంటి? రివీల్ చేసిన మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో క్రేజీ హిట్ చిత్రాల్లో దర్శకుడు కే మురళీ మోహన్ రావు తెరకెక్కించిన ఈ కౌబాయ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు రీరిలీజ్ కి రాబోతుంది. మరి ఈ సినిమా 1990 లో రిలీజ్ అయ్యి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రాబోతుంది.. 4 కే లో రీమాస్టర్ చేసిన ఈ సినిమా విశేషాలు కొన్ని మెగాస్టార్ పంచుకోవడం జరిగింది.

అయితే ఈ సినిమాకి హాలీవుడ్ చిత్రం ‘ఇన్సెప్షన్’కి ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ లింక్ కి చెప్పడం ఆశ్చర్యంగా మారింది. ఈ సినిమాలో స్టార్ స్టార్ అనే సాంగ్ అప్పట్లో ఒక వింత. చిరంజీవి నేల మీద నుంచి నడుస్తూ గోడ పై నుంచి 360 డిగ్రీలు నడిచి మళ్ళీ నేల మీదకి వస్తారు. అయితే దాని వెనుక ఉన్న సీక్రెట్ రివీల్ చేశారు. అందుకోసం వేసిన ఒక స్పెషల్ సెట్ ఉందని దానిని కెమెరాతో తిప్పుతూ తెరకెక్కించినట్టు తెలిపారు.

అప్పట్లోనే తాము చేసిన టెక్నాలిజీతోనే ఇన్సెప్షన్ అనే సినిమాలో కూడా సన్నివేశాలు కనిపిస్తాయని తాను తెలిపారు. మరి ఇన్సెప్షన్ అనేది హాలీవుడ్ మైండ్ బెండింగ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, లియోనార్డో డికాప్రియోతో తెరకెక్కించిన సినిమా ఇది తెలుగులో ‘ఆరంభం’ పేరిట 2010లో రిలీజ్ అయ్యింది. అందులో మెగాస్టార్ చెప్పిన లాంటి సన్నివేశాలు ఉంటాయి. అలా రెండు సినిమాలకి లింక్ కుదరడం అనేది గమనార్హం. ఇక మెగాస్టార్ కొదమసింహం ఈ నవంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version