ఇలాంటి క్లైమాక్స్ జరిగిందా అని షాకయ్యా – కిరణ్ అబ్బవరం

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. విలేజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో కిరణ్ అబ్బవరం గెస్టుగా వచ్చారు.

ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం ఈ చిత్ర క్లైమాక్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను జీవితంలో చాలా దారుణాలు విన్నానని.. అయితే, ఈ చిత్ర యూనిట్ తనవద్దకు వచ్చి ఈ చిత్ర క్లైమాక్స్ చెప్పినప్పుడు తాను షాక్ అయ్యాను.. నిజంగా ఇలాంటి దారుణాలు జరిగాయా.. అని తాను అనుకున్నట్లు తెలిపారు.

ఇలాంటి బాధను ముందుగా ఆ ఘటన జరిగిన ఊరివారు చూడాలి.. ఇలాంటి దారుణం తమ ఊరిలో జరిగిందని.. తమ ఊరిలో జరిగిన కథను పక్కవాళ్లకు చెప్పుకోలేకపోయాం అని వారు ఫీల్ అవుతారు.. అంటూ కిరణ్ అబ్బవరం కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమాలో అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాయిలు కంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి ప్రొడ్యూస్ చేస్తుండగా నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

Exit mobile version