ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 3

మన ఇండియన్ సినిమా ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి కూడా సాలిడ్ కంటెంట్ అటు బిగ్ స్క్రీన్స్ ఇటు ఓటిటి లలో వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పాపులర్ స్ట్రీమింగ్ సంస్థలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ అలాగే జియో హాట్ స్టార్ లాంటి సంస్థలలో ఇంట్రెస్టింగ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. అయితే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఓ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తాలూకా మూడో సీజన్ ని తీసుకొచ్చేసారు. మరి అదే “ఢిల్లీ క్రైమ్”.

రసిక దుగల్ అలాగే హుమా ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ పట్ల మంచి క్రేజ్ ఆడియెన్స్ లో ఉంది. మరి ఈ సీజన్ ఎట్టకేలకి నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సీజన్ మొత్తం 6 ఎపిసోడ్స్ గా వచ్చింది. యావరేజ్ గా ప్రతీ ఎపిసోడ్ 45 నిమిషాలకి పైగా 51 నిమిషాల లోపే ఉన్నాయి. ఇది ఈ వారాంతం మాత్రం ఓటిటి వీక్షకులకు మంచి క్రైమ్ థ్రిల్లర్ దొరికేసినట్టే అని చెప్పాలి. ఇక ఈ సీజన్ తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version