అఫీషియల్: ‘మెగా 158’ కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రఫర్

Mega158

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాలు కాకుండా చేయనున్న సినిమాలు కూడా లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో తన బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు కే ఎస్ రవీంద్ర (కొల్లి బాబీ) కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన రెండో సినిమా కూడా ఒకటి. మెగాస్టార్ కెరీర్ 158వ సినిమా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా నుంచి నేడు మేకర్స్ ఓ అప్డేట్ రివీల్ చేశారు. ఈ సినిమాకి లేటెస్ట్ సూపర్ హిట్ లోక, లక్కీ భాస్కర్, కింగ్ ఆఫ్ కొత్త, లాంటి సినిమాలకి కెమెరా వర్క్ అందించిన సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి పని చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ అలానే దర్శకుడు కూడా తనకి తమ టీం తరపున విష్ చేశారు. సో ఈ కొత్త అడిషినల్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది అని చెప్పాలి.

Exit mobile version