‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఈసారైనా ఆయన వస్తాడా..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవల రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా సోషల్ మెసేజ్‌తో కూడిన కథగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్న తీరును వారు ప్రత్యక్షంగా థియేటర్లలో చూస్తున్నారు. ఇలాంటి మాసివ్ రెస్పాన్స్ తమ సినిమాకు రావడంతో చిత్ర యూనిట్, ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

నవంబర్ 12న సాయంత్రం 6 గంటల నుండి ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకలు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించనున్నారు. అయితే, ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ వస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా వేడుకకు ఒక్కసారైనా విజయ్ దేవరకొండను తీసుకొస్తామని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ సక్సెస్ వేడుకలకు రౌడీ స్టార్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version