నటుడు తిరువీర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కామెడీ డ్రామాగా ఈ సినిమాకు ప్రక్షకులు మంచి మార్కులు వేశారు. ఇక ఈ సినిమాకు రోజురోజుకూ ప్రేక్షకాదరణ పెరుగుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో ఈ సినిమాను ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
వారి కోరిక మేరకు ఈ చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పుడు రెడీ అయ్యారు. నవంబర్ 14 నుండి ఈ చిత్రాన్ని కర్ణాటకలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్యూర్ కామెడీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్గా నటించగా రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమాకు కర్ణాటకలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.
