నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి నటించిన లేటెస్ట్ చిత్రమే “ది గర్ల్ ఫ్రెండ్”. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజే మంచి టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొత్తం నాలుగు రోజుల రన్ ని ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమాకి అసలు టెస్ట్ నిన్న వర్కింగ్ డే సోమవారం మొదలైన సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమా అందులో కూడా పాస్ అయ్యిందని చెప్పాలి. మేకర్స్ ఈ సినిమాకి రిలీజ్ అయ్యిన రోజు కంటే నిన్న వర్కింగ్ రోజునే ఎక్కువగా పెర్ఫామ్ చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అయినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా విద్యా కొప్పినీడి మరియు ధీరజ్ మొగిలినేని నిర్మాణం వహించారు. అలాగే గీతా ఆర్ట్స్ వారు తమ సమర్పణలో ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొచ్చారు.
No monday blues for #TheGirlfriend at the box office ❤????❤????
DAY 4 >>>> DAY 1 ????????
Book your tickets for THE BEST TELUGU FILM OF THE YEAR now!
????️ https://t.co/aASxyrtyIG pic.twitter.com/XhgYvNNsso
— Geetha Arts (@GeethaArts) November 11, 2025
