ట్విస్ట్: గ్లోబ్ ట్రాటర్ నుంచి ట్రైలర్.. నాలుక్కరుచుకున్న ఓటిటి సంస్థ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి మరికొన్ని రోజుల్లో బిగ్గెస్ట్ ఈవెంట్ లో భారీ రివీల్ ఒకటి రానుంది. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ వారు లైవ్ స్ట్రీమింగ్ గా ఈ సినిమా ఈవెంట్ ని చేయనున్న సంగతి తెలిసిందే.

మరి దీనిపై ఒకో అప్డేట్ ఇస్తూ లేటెస్ట్ గా నాలుక్కరుచుకున్నారని చెప్పాలి. ఈ గ్రాండ్ ఈవెంట్ లో రాజమౌళి ట్రైలర్ ని రివీల్ చేస్తున్నారంటూ ముందు పోస్ట్ చేయడంతో మహేష్ బాబు అభిమానులకి ఒక్కసారిగా ఫ్యుజ్ లు ఎగిరిపోయినంత పనయ్యింది.

దీనితో గ్లోబ్ ట్రాటర్ నుంచి మరో బిగ్ సర్ప్రైజ్ అనుకునే లోపే ట్విస్ట్ ఇస్తూ ఆ పోస్ట్ తొలగించి ట్రైలర్ అనేది తీసేసి నెవర్ బిఫోర్ రివీల్ అంటూ కన్ఫర్మ్ చేశారు. దీనితో మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం డిజప్పాయింట్ అయ్యారు. మరి జక్కన్న ఏం ప్లాన్ చేశారు అనేది ఆరోజే చూడాలి.

Exit mobile version