పవన్, లోకేష్, అనిరుద్.. ఇంకోమాట లేదు

Pawan-kalayan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ సెన్సేషనల్ హిట్ అయ్యి పవన్ కెరీర్ లోనే భారీ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ కాంబినేషన్ తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లలో నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ తో ఓ సినిమా లాక్ అయ్యినట్టుగా స్ట్రాంగ్ బజ్ ఇపుడు మొదలైంది.

ఇక ఆ నిర్మాణ సంస్థ దగ్గర పవన్, లోకేష్ కనగరాజ్ ల ఇద్దరి డేట్స్ ఉన్నాయి. అలాగే హెచ్ వినోద్ డేట్స్ కూడా ఉన్నాయి కానీ వీటిలో మాత్రం పవన్ ఫ్యాన్స్ పవన్, లోకేష్ కనగరాజ్ అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ ల కాంబినేషన్ మాత్రమే కావాలి ఇంకో మాట లేదు అని గట్టిగా కోరుకుంటున్నారు. ఈ ఒక్క కాంబినేషన్ లాక్ అయ్యేలా ఉంటే బాగుంటుంది అని భావిస్తున్నారు. మరి వీరి కోరిక నెరవేరుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.

Exit mobile version