ఆ విషయంలో ‘అఖండ 2’ స్పీడ్ పెంచాల్సిందే..!

Akhanda2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సీక్వెల్ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య తాండవం చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. అయితే, ఈ తాండవానికి కావాల్సిన ప్రధాన అంశం ప్రమోషన్స్. ఈ విషయంలో అఖండ మేకర్స్ కాస్త వెనకబడ్డారని చెప్పాలి. ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నారు. అంటే, 50 రోజులు కూడా లేదు. కానీ, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, ఓ గ్లింప్స్ వచ్చింది.

ఇప్పటికైనా మేకర్స్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టి, ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వదిలితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయాలంటే ప్రమోషన్స్‌లో వేగం పెంచాల్సిందే అని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ‘అఖండ 2’ మేకర్స్ ఈ విషయంపై ఎలాంటి కేర్ తీసుకుంటారో చూడాలి.

Exit mobile version