‘కాంతార చాప్టర్ 1’ రెండు వారాల కలెక్షన్స్.. ఇది కదా కావాల్సింది..!

Kantara Chapter 1

కన్నడలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి. యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తన ప్రతిభను రుజువు చేస్తూ ఈ సినిమాను తీయడం. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కళ్లు చెదిరే రేంజ్‌లో వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.717.50 కోట్లు వసూలు చేసి శాండల్‌వుడ్ చరిత్రలో విశేష ఘనతను సాధించింది. అందులో కన్నడ వెర్షన్ ఒక్కటే రూ.200 కోట్ల మార్క్ దాటడం ఇదే తొలిసారి. ఇది రిషబ్ శెట్టి మరియు హోంబలే ఫిలింస్ కాంబినేషన్‌కి మరో మైలురాయి విజయంగా నిలిచింది.

తెలుగు వెర్షన్ విషయానికి వస్తే, ఏపీ మరియు టీఎస్ రాష్ట్రాల్లో రెండు వారాల్లో రూ.105 కోట్లకు పైగా వసూలు చేసింది. దీపావళి సీజన్ ఉత్సాహంతో సినిమా రాబోయే రోజుల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి వంటి నటులు తమ పాత్రలతో సినిమాకు బలాన్నిచ్చారు, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది.

Exit mobile version