‘4 టేల్స్’ – ఈటీవీ విన్ నుండి ఒక సరికొత్త ఆంథాలజీ సిరీస్!

ఈటీవీ విన్, తెలుగు ఓటీటీ ప్రపంచంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ‘4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్’ అనే విలక్షణమైన కాన్సెప్ట్‌తో ‘4 టేల్స్’ అనే ఆంథాలజీ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సినిమా పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ‘కథా సుధ’లో ఇది ఒక భాగం.

‘ది మాస్క్’తో ప్రారంభం
ఈ సిరీస్‌లో మొదటి కథ, ‘ది మాస్క్’, ఈ ఆదివారం (అక్టోబర్ 12, 2025) నుండి ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్, మరియు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ లాంచ్ చేయడం విశేషం.

సులభంగా డబ్బు సంపాదించాలని క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోయి, అప్పులపాలైన ఒక యువకుడు… ఆ అప్పు తీర్చడానికి దొంగతనానికి వెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడు అనేదే ‘ది మాస్క్’ కథ. ఈ చిన్న కథాంశంలోనే దర్శకుడు కొత్తపల్లి సురేష్ సస్పెన్స్, డ్రామా, మరియు డార్క్ హ్యూమర్‌ను అద్భుతంగా మిళితం చేసి, బుల్లితెరపైనే ఒక సినిమాటిక్ అనుభవాన్ని అందించారు.

ఈ చిత్రాన్ని ‘కథా గని పిక్చర్స్’ బ్యానర్‌పై కొత్తపల్లి సురేష్ నిర్మించి, దర్శకత్వం వహించారు. ‘నరుడి బ్రతుకు నటన’ ఫేమ్ రిషికేశ్వర్ యోగి సమర్పణలో ఈ సినిమా రూపొందింది. రావన్ నిట్టూరి మరియు గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించగా, అక్షయ్ వసూరి సినిమాటోగ్రఫీ, విశాల్ భరద్వాజ్ సంగీతం, మరియు రిషికేశ్వర్ యోగి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. సహా నిర్మాతలుగా బేబీ విరాన్ష మరియు దీపిక అలోల వ్యవహరించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధృవ్ చిత్రణ్.

Exit mobile version