మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. అయితే తన ఈ తక్కువ సమయం సినీ కెరీర్ లోనే నెగిటివిటీ కూడా తాను చూసేసాడు. అయితే దానిని అధిగమించి ఇప్పుడు న్యూట్రల్స్ లో మరింత మెప్పు పొందుతున్నాడు.
కానీ ఈ క్రమంలో తనకి మాత్రం సింపతీ వద్దని చెప్పేస్తున్నాడు. తన సినిమాలు ట్రైలర్, టీజర్ లు చూసి కంటెంట్ నచ్చితే సినిమాకి రండి తప్పితే నాపై సింపతీతో మాత్రం రాకండి అని చెప్పేస్తున్నాడు. ఆ మధ్య తనపై నెగిటివిటీ పరంగా కిరణ్ ఓపెన్ గానే మాట్లాడిన సంగతి తెలిసిందే.
పైగా పలు ఇంటర్వ్యూస్ లో తన మాటలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనితో తనకి సింపతీ చూపించే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. కానీ అలా వచ్చే ఆదరణ తనకి వద్దని లేటెస్ట్ గా చెప్పడం కూడా వైరల్ అయ్యింది. దీనితో కిరణ్ అబ్బవరం మరో మెట్టు ఎక్కేసాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.