సుకుమార్‌తో రామ్ చరణ్ అప్పుడే మొదలెడతాడా..?

ramcharan-sukumar

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమా ప్రస్తుతం పూణేలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే, ఈ సినిమా తర్వాత చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్‌లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు తప్పక ఫాలో అవుతున్నారు. అయితే, ఫిల్మ్ సర్కిల్స్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 2026లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. పెద్ది షూటింగ్ జనవరి 2026 వరకు కొనసాగనుండటంతో.. ఆ తర్వాత చరణ్ సుకుమార్ కొత్త చిత్రంపై కేర్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version