నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇపుడు వినిపిస్తున్నాయి.
దీనితో అఖండ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ ని ముగించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో లేటెస్ట్ గా 13 కోట్లకి డీల్ ని మేకర్స్ పూర్తి చేశారట. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 సాలిడ్ ఫిగర్స్ కి సేల్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.