అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం NC24 వర్కింగ్ టైటిల్‌తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తుండగా మిస్టిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఆయుధపూజ సందర్భంగా ఈ చిత్రంలో హీరోకు అండగా నిలిచే ఆయుధాన్ని రివీల్ చేస్తూ ప్రేక్షకులకు ఆయుధ పూజ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆయుధం పోస్టర్‌తో ఈ సినిమాలో హీరో ఎలాంటి యాక్షన్ చేయబోతున్నాడనే క్లూ ఇచ్చారు మేకర్స్.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాత్సవ కీలక పాత్రలో నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.