ఓజీ నైజాం డే1 ప్రిడిక్షన్.. రూ.25 కోట్ల షేర్‌తో వీరవిహారం..!

OG movie Review

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అందరి చూపులు ఈ చిత్ర వసూళ్లపై పడింది.

ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ అన్నీ కూడా హౌజ్‌ఫుల్ అయ్యాయి. అటు ఫస్ట్ డే షోలు కూడా దాదాపు అన్నీ హౌజ్‌ఫుల్ అయ్యాయి. దీంతో ఓజీ ప్రీమియర్స్, ఫస్ట్ డే కలుపుకుని నైజాం ఏరియాలో ఏకంగా రూ.25 కోట్ల షేర్ వసూళ్లు సాధించడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

ఇది పవన్ క్రేజ్‌కు మాత్రమే సాధ్యమని వారు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే, ఆ తర్వాత బాక్సాఫీస్ రికార్డులు బద్దలవకుండా ఆపడం ఎవరి సాధ్యం కాదని వారు జోస్యం చెబుతున్నారు. మరి నైజాం ఏరియాలో ఓజీ నిజంగానే డే1 వసూళ్లతో వీరవిహారం చేస్తాడా.. అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

Exit mobile version