అల్లరి నరేష్ చేతుల మీదుగా ‘విద్రోహి’ ట్రైలర్ విడుదల

రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయి ప్రధాన పాత్రల్లో వి.ఎస్.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘విద్రోహి’. వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను కామెడీ కింగ్ అల్లరి నరేష్ విడుదల చేశారు. ఇప్పటికే హీరో శ్రీకాంత్ ఫస్ట్ లుక్‌ను, వి.వి. వినాయక్ మొదటి పాటను, ఆర్.పి. పట్నాయక్ రెండో పాటను విడుదల చేసి చిత్ర బృందానికి మద్దతు పలికారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్ విడుదల అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ, “‘విద్రోహి’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్ర బృందంలోని చాలా మంది నాకు సన్నిహితులు. ఈ సినిమా వారికి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. దర్శక నిర్మాతలకు, నటీనటులు, టెక్నీషియన్లందరికీ నా శుభాకాంక్షలు” అని తెలిపారు.

నిర్మాత వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “మా ‘విద్రోహి’ ట్రైలర్‌ను విడుదల చేసిన అల్లరి నరేష్‌గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. శ్రీకాంత్ గారు, వి.వి. వినాయక్ గారు, ఆర్.పి. పట్నాయక్ గారు అందించిన మద్దతు మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం” అని అన్నారు.

దర్శకుడు వి.ఎస్.వి. మాట్లాడుతూ, “శ్రీకాంత్ గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు, వి.వి. వినాయక్ గారు విడుదల చేసిన మొదటి పాటకు, ఆర్.పి. పట్నాయక్ గారు విడుదల చేసిన రెండో పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు అల్లరి నరేష్ గారు ట్రైలర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు చెప్పినందుకు కృతజ్ఞతలు. రవిప్రకాష్, శివ కుమార్ అద్భుతంగా నటించారు. ఇది సరికొత్త పాయింట్‌తో రూపొందించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని చెప్పారు.

Exit mobile version