10 రోజుల్లో ‘మిరాయ్’ వసూళ్లు ఎంతంటే..?

Mirai

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన రీసెంట్ మూవీ ‘మిరాయ్’ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం విజయం సాధించింది.

ఇక ఈ సినిమాలోని కంటెంట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబడుతూ సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా 10 రోజులు ముగిసే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ.134.40 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది.

దీంతో సినిమా త్వరలోనే రూ.150 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని సినీ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా విలన్‌గా మంచు మనోజ్ రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version