ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ తన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ, అమీర్ ఖాన్ ఏం మాట్లాడాడు అంటే.. ‘నేను కీలక పాత్రలో నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ రూ.200 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. నిజానికి నేను నిర్మించే ప్రతి సినిమా బడ్జెట్‌ విషయంలో జాగ్రత్తగా ఉండటం నాకు అలవాటు. కథకు ఏది అవసరమో దాన్నే ఎంపిక చేసుకుంటాను. ఈ సినిమా చేయడం వల్ల ఇంత లాభం వస్తుందనే విషయంపై కాకుండా నష్టాల పాలవ్వకుండా చూడటమే నా ప్రథమ కర్తవ్యం’ అని తెలపారు.

అమీర్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఐతే, దురదృష్టవశాత్తూ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ విషయంలో దానిని విస్మరించా. అప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ హిట్‌ మీద హిట్‌ కొట్టడంతో ఈ మూవీ విషయంలో అతి నమ్మకం ఎక్కువైంది. కానీ, నా అంచనా తప్పింది. బడ్జెట్‌ విషయంలో పరిమితులు పెట్టుకోకపోవడంతో నష్టాలు మిగిల్చింది’ అని అమీర్ ఖాన్ తెలిపారు. కాగా ‘లాల్‌ సింగ్‌ చడ్డా ’లో నాగచైతన్య, కరీనా కపూర్‌ఖాన్, మోనా సింగ్‌, మానవ్‌ విజ్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు.

Exit mobile version