‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి గత ఏడాదిలోనే రావాల్సింది కానీ అక్కడ నుంచి ఇపుడు ఏడాది ఆలస్యం అయ్యినప్పటికీ ఆ హైప్ మాత్రం పదిలంగానే ఉంది. ఇలా ఎట్టకేలకి రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లేకుండా భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది.

కానీ ఎంత హైప్ ఉన్నప్పటికీ సినిమాకి సరైన ప్రమోషన్స్ చేయకపోవడంపై ఫ్యాన్స్ డిజప్పాయింట్ గా ఉన్నారు. మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు అనుకుంటే దాని హైప్ ని ఓజి రీప్లేస్ చేసింది కానీ తమిళ్, హిందీ భాషల్లో మాత్రం ఇప్పటికీ సరైన ప్లానింగ్స్ కనిపించడం లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనితో పాన్ ఇండియా లెవెల్లో ముద్ర వేస్తుంది అనుకున్న ఈ సినిమా కేవలం తెలుగు వరకే ప్రభావం చూపించేలా కనిపిస్తుంది. సో ఈ కొన్ని రోజుల్లో మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.

Exit mobile version