ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు నటిస్తున్నాడని.. ఆయన ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ కూడా అయ్యాడని తెలుస్తుంది.
మరి ఈ సినిమాలో యోగి బాబు పాత్రను అట్లీ ఎలా డిజైన్ చేశాడు అనేది చూడాలి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.