బాలయ్య పంచ్ డైలాగ్స్ తో రజినీకాంత్.. 50 ఏళ్ల ప్రస్థానంపై మెసేజ్!

rajinikanth-balayya

సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే నటసింహ బాలయ్య ఇద్దరు విషయంలో కామన్ గా ఒక పాయింట్ ఆడియెన్స్ ని ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తాయి. అదేంటి అంటే వారి నుంచి వచ్చే పవర్ఫుల్ పంచ్ లైన్స్. మరి బాలయ్య డైలాగ్ ని సూపర్ స్టార్ చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలయ్య సినిమాలు లెజెండ్ నుంచి ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అని అలాగే చిన్న కేశవ రెడ్డి నుంచి కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్స్ ని రజినీకాంత్ చెప్పి అదరగొట్టారు. అయితే బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్ళు హీరోగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ బుక్ లో స్థానం సంపాదించుకున్న నేపథ్యంలో రజినీకాంత్ తన బెస్ట్ విషెస్ చెప్పి బాలయ్యకి ప్రేమతో మెసేజ్ అందించారు.

బాలయ్యలా ఎవరూ చెయ్యలేరు అని బాలయ్య అంటే విపరీతమైన పాజిటివిటీ, ఇదే పాజిటివిటీతో మరిన్ని సినిమాలు చేయాలి మరో 50 ఏళ్ళు కొనసాగాలి అంటూ రజినీకాంత్ చివరలో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి మరీ బాలయ్యకి తన శుభాకాంక్షలు తెలిపారు. దీనితో తన మెసేజ్ వైరల్ గా మారింది.

Exit mobile version