కన్ఫర్మ్ : ‘ఓజి’లో టిల్లు బ్యూటీ.. రాధిక ఏం చేస్తుందో..?

og-Neha-Shetty

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ నేహా శెట్టి కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. డీజే టిల్లు చిత్రంలో రాధిక పాత్రతో యూత్‌లో సాలిడ్ క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో నేహా శెట్టి ఈమేరకు కామెంట్స్ చేసింది. త్వరలోనే ఓజిలో ఓ సర్‌ప్రైజ్ ఉంటుందని ఆమె చెప్పడంతో ఆమె కూడా ఈ సినిమాలో కనిపించనుందని కన్ఫర్మ్ అయింది.

అయితే, ఈ సినిమాలో ఆమె నటిస్తుందా లేక స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version