మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్స్ ఇస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక మెగా 158 చిత్రాన్ని దర్శకుడు బాబీతో తెరకెక్కించబోతున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
రక్తపాతంతో బెంచ్‌మార్క్ సెట్ చేసిన గొడ్డలిని ఇందులో మనకు చూపెట్టారు. ఇక ఈ సినిమాలో బ్లడ్ బాత్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఈ కాన్సెప్ట్ పోస్టర్‌తోనే మనకు తెలియజేశారు. ఈ సినిమా అన్ని అంశాల్లోనూ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుందని దర్శకుడు బాబీ ధీమాగా చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ప్రేక్షకులను స్టన్ చేయనుందని తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.
మొత్తానికి ఈ కాన్సెప్ట్ పోస్టర్‌తో మెగా158 ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఎన్‌కె ప్రొడ్యూస్ చేస్తున్నారు.