నందమూరి బార్న్ కింగ్ నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రమే ‘అఖండ 2 తాండవం’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతుంది అని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ దగ్గరకి వస్తుండగా అప్డేట్స్ లేక ఫ్యాన్స్ ఓ క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.
మరి ఫైనల్ గా అఖండ 2 ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం అఖండ 2 మొదటి పాటపై అప్డేట్ ఈ ఆగస్ట్ 6 న వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ తర్వాత వరుసగా అప్డేట్స్ ఉంటాయట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా 14 రీల్స్ వారు నిర్మాణం వహించారు.