బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇండస్ట్రీకి వచ్చిన 33 ఏళ్లకు తొలిసారిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ భార్య గౌరీఖాన్ ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డుల విజేతలకు అభినందనలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ను షేర్ చేసిన షారుక్.. ఓ ఫన్నీ క్యాప్షన్ పెట్టారు. ఇంతకీ, షారుక్ ఏం చెప్పారంటే.. ‘రాత్రి డిన్నర్ చేసే సమయంలో నా గురించి కూడా గొప్పగా చెప్పవా ?, అలాగే నా సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకు థాంక్యూ’ అని షారుఖ్ క్యాప్షన్ పెట్టారు.
ప్రస్తుతం ఈ క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక షారుక్‌కు విషెస్ చెబుతూ కుమార్తె సుహానా కూడా పోస్ట్ పెట్టారు. దీనికి ఈ బాలీవుడ్ బాద్‌షా స్పందిస్తూ.. ‘‘నేను నిద్రలో కూడా నిన్ను అలరించాలని కోరుకుంటున్నా’’ అంటూ కుమార్తెకు ఆన్సర్ ఇచ్చారు షారుఖ్. ఆగస్టు 1న ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకున్నారు.