టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఘాటి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే, ఈ సినిమాను ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేశారు.
దీంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ మేకర్స్ వదిలారు. ఘాటి చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించబోతున్నట్లు వారు తెలిపారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్టు 6న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఈ ట్రైలర్‌లోనే ‘ఘాటి’ చిత్ర రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నారు. దీంతో అనుష్క అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క తో పాటు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పూర్తి క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.