గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు “పెద్ది” సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చరణ్ రోల్ తన కెరీర్లో మరో ఐకానిక్ రోల్ గా నిలుస్తుంది అని అభిమానులు భావిస్తున్నారు. అయితే మన టాలీవుడ్ హీరోస్ లో రామ్ చరణ్ ఆరా కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. కొన్ని పవర్ఫుల్ పాత్రలకి రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సరిపోతాడు అనే కామెంట్స్ ఎప్పుడు నుంచో ఉన్నాయి.
మగధీర నుంచి మొన్న RRR లో అల్లూరిగా రామ్ చరణ్ డైనమిక్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే RRR క్లైమాక్స్ లో కూడా రాజమౌళి చూపించిన షాట్స్ తో శ్రీరాముని పాత్రకి కూడా రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సరిపోతాడు అనే కామెంట్స్ అనేకం. అంతే కాకుండా ఆ మధ్య “హను మాన్” సినిమాకి కూడా చరణ్ పేరు వినిపించింది.
మరి ఇలాంటి బరువైన పాత్రలకి సైతం రామ్ చరణ్ పేరు బాగా వినిపించగా లేటెస్ట్ గా తన యానిమేషన్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న డివోషనల్ బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహా దర్శకుడు అశ్విన్ కుమార్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఒక లైవ్ యాక్షన్ సినిమా తీస్తే గనుక శ్రీరాముని అవతారంకి తాను రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా ఉంటారని తెలిపారు.
శ్రీకృష్ణ అవతారానికి ఎవరు అనేది చెప్పలేను కానీ రామావతారానికి మాత్రం రామ్ చరణ్ పేరును తాను ఎంచుకోవడంతో మరోసారి అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఆ మధ్య నితీష్ తివారి రామాయణకి రామ్ చరణ్ పేరు బాగా వైరల్ అయ్యింది. మరి ఇలాంటి ప్రాజెక్ట్ చరణ్ కి ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.