టాలీవుడ్ యంగ్ హీరో నరేష్ అగస్త్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు విపిన్ తెరకెక్కించగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమాలో రబియా ఖటూన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఫీల్ గుడ్ కంటెంట్‌తో కట్ చేశారు. ప్రేమలో పడ్డ హీరోహీరోయిన్లకు తమ జీవితలక్ష్యాలు వారి ప్రేమకు ఎలా అడ్డంకిగా మారుతాయి.. వీటి మధ్య వారి కుటుంబ సభ్యుల నుంచి వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.. వాటన్నింటినీ ఈ ఇద్దరు ఎలా ఎదుర్కొంటారు అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ కట్ చూస్తే అర్థమవుతుంది.
చక్కటి ప్రేమకథకు అంతే చక్కటి ఎమోషనల్ కథను జోడించి దర్శకుడు విపిన్ ఈ సినిమాను రూపొందించాడని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఇక రబియా ఖటూన్ హీరోయిన్‌గా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. భారీ క్యాస్టింగ్‌తో పాటు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా నిలవనుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 22న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.