‘కూలీ’ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

అయితే, ఈ చిత్రానికి ఓవర్సీస్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ ఏకంగా రూ.86 కోట్లు పలకడంతో ఈ మూవీ అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. తలైవా ఇమేజ్‌కు లోకేష్ కనగరాజ్ క్రేజ్ తోడుకావడం.. పలువురు స్టార్ యాక్టర్స్ ఇందులో నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు అక్కడి ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఆతృతగా ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ భారీ స్థాయిలో రిలీజ్ చేయనుంది.

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉఫేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version