‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హేమంత్ రావు, ఇప్పుడు ‘‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ‘పుష్ప’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డాలీ ధనుంజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కన్నడ సినీ ఇండస్ట్రీకి చిరపరిచితమైన ‘చక్రవర్తి’ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
జె. ఫిలిమ్స్ బ్యానర్‌పై డాక్టర్ వైశాక్ జే. గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా చిత్ర యూనిట్ డాలీ ధనుంజయ్ కొత్త లుక్‌ను విడుదల చేసింది. మ్యాన్‌లీ లుక్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తున్న ధనుంజయ్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘పుష్ప 1, 2’ సినిమాలతో పాపులర్ అయిన డాలీ ధనుంజయ్, ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తుండగా, అద్వైత్ గురుమూర్తి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. విశ్వాస్ కశ్యప్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. శివరాజ్ కుమార్ ప్రస్తుతం ‘జైలర్ 2’, ‘పెద్ది’ వంటి చిత్రాల్లో నటిస్తుండగా, ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.