ఎన్టీఆర్ కోసం రంగంలోకి ఆ యాక్టర్.. పవర్‌ఫుల్ కాంబో ఫిక్స్ అయ్యేనా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ‘వార్-2’ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్‌కు రెడీ చేస్తున్న తారక్, ప్రశాంత్ నీల్‌తో మూవీని వచ్చే ఏడాదిలో రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలు రిలీజ్ కాకముందే తారక్ నెక్స్ట్ మూవీపై నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని.. ఈ సినిమా నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ఉంటుందని నిర్మాత నాగవంశీ పేర్కొన్నాడు. కాగా, ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్రలో ఓ పవర్‌ఫుల్ యాక్టర్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటిని ఈ సినిమాలో విలన్ పాత్రలో తీసుకోవాలని నాగవంశీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. తారక్‌ను ఢీకొట్టే పాత్రలో రానా అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని మేకర్స్ భావిస్తున్నారట. మరి నిజంగానే ఎన్టీఆర్‌ను ఢీకొట్టేందుకు రానా రంగంలోకి దిగుతాడా..? అనేది వేచి చూడాలి.

Exit mobile version