ఇంటర్వ్యూ : హీరోయిన్ వర్ష బొల్లమ్మ – ‘తమ్ముడు’ మూవీలో మైండ్ బ్లోయింగ్ యాక్షన్, విజువల్స్ ఎంజాయ్ చేస్తారు!

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా నటస్తున్న లేటెస్ట్ మూవీ “తమ్ముడు”. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు చిత్ర క్యారెక్టర్ లో నటించిన తన ఎక్స్‌పీరియన్స్ తెలిపారు హీరోయిన్ వర్ష బొల్లమ్మ.

– నేను గతంలో SVC సంస్థలో “జాను” అనే మూవీలో నటించాను. “తమ్ముడు” కోసం పిలవగానే వచ్చి ఆడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో వెంటనే ఓకే అయ్యాను. దర్శకుడు వేణు గారు ఈ మూవీ గురించి చెబుతూ అడవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నారు. నేను ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తాను అని చెప్పాను. అలా చిత్ర క్యారెక్టర్ కు నేను సెలెక్ట్ అయ్యాను.

– హీరో నితిన్ క్యారెక్టర్ జై కు చిత్ర డ్రైవింగ్ ఫోర్స్‌లా ఉంటుంది. జై కు అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేస్తుంది చిత్ర. వారి మధ్య ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. రియల్ లైఫ్ లో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉండేది. అది ఈ సినిమాతో కుదిరింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేశాను. ఏదైనా చేయాలనుకుంటే వెంటనే అడుగువేసే క్యారెక్టర్ చిత్రది. నా రియల్ లైఫ్ లో నేను అలా కాదు.

– తమ్ముడు మూవీ టైటిల్ ఈ కథకు యాప్ట్. పవన్ గారి ఒక సూపర్ హిట్ మూవీ ఈ టైటిల్‌తో ఉండటం మేము హ్యాపీగా ఫీలయ్యే విషయం. నా క్యారెక్టర్ కు “తమ్ముడు” కథలో మంచి ప్రాధాన్యత ఉంటుంది. బిగిల్ మూవీ తర్వాత ఫిజికల్‌గా శ్రమించిన చిత్రమిదే. ఈ చిత్రంలో లయ గారు మరో కీ రోల్ చేస్తున్నారు. ఆమె జర్నీ మా అందరికీ ఇన్‌స్పిరేషన్. హీరోయిన్ గా ఒక కెరీర్ చూసిన ఆమె పర్సనల్ లైఫ్ లోకి వెళ్లడం, మళ్లీ ఇప్పుడు రీ-ఎంట్రీ ఇవ్వడం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆమె కెరీర్ లో జరిగిన విశేషాలు మాతో షేర్ చేసుకునే వారు.

– “తమ్ముడు” మూవీని ఏదైనా స్టూడియోలో ఉన్న చిన్న అడవిలో కూడా షూట్ చేయొచ్చు.. కానీ సహజంగా ఉండేలా మారేడుమిల్లి అడవిలో చిత్రీకరించాం. అది దట్టమైన అడవి. వర్షాకాలంలో పాములు, తేళ్లు కనిపించేవి. రాత్రిపూట షూటింగ్ లో కేవలం కాగడాలు పట్టుకుని నటించాం. షూటింగ్ లో పెద్దవాళ్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా ఇబ్బందిపడ్డారు. లయగారు అమెరికా నుంచి వచ్చారు. అక్కడ సుకుమారంగా ఉండి ఈ అడవిలో చెప్పులు లేకుండా నటించారు. రోజూ ఏదో ఒక గాయం అయ్యేది. అయినా ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొనేవారు.

– హీరో నితిన్ చాలా కామ్‌గా ఉంటారని ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ ఆయన చాలా ఫన్ పర్సన్. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్స్ అవీ ఏమీ లేవు. మేము సరదాగా మాట్లాడుకునేవాళ్లం. చిన్నా, పెద్దా ప్రతి ఆర్టిస్టుకు ఆయన గౌరవం ఇచ్చేవారు. నేను జోక్స్ చెప్పి ఆయనను విసిగించా. నాకు అనిపించింది సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటా. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పర్‌ఫార్మ్ చేసేప్పుడు అప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తే చెప్పాను. కానీ డైరెక్టర్ గారు డైలాగ్ లో ఉన్నది ఉన్నట్లు స్ట్రిక్ట్ గా చెప్పమనేవారు. నేను మిడిల్ క్లాస్ మెలొడీస్ చేసినప్పుడు స్పాంటేనియస్ గా చాలా ఇంప్రూవ్ చేసి డైలాగ్స్ చెప్పాం. ఆ మూవీకి అలా కుదిరింది.

– “తమ్ముడు” మూవీ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. అయితే ఇందులో అనేక లేయర్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ కు సంబంధించి సాలిడ్ యాక్షన్ ఉంటుంది. మొత్తంగా మూవీలో యాక్షన్ సీక్వెన్సులు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. “తమ్ముడు” అలాంటి సినిమా. విజువల్ ట్రీట్ లా ఉంటుంది. మంచి సౌండింగ్ తో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

– ప్రస్తుతం కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. దీంతో పాటు మరో సిరీస్ చేస్తున్నా. రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. వాటి డీటెయిల్స్ త్వరలో చెబుతా. సైకో కిల్లర్ క్యారెక్టర్ లో కనిపించాలనేది నా కోరిక. నేను సైకో కిల్లర్ ఏంటి అనుకుంటారు. కానీ మనం ఆ జానర్ మూవీస్ చూస్తే ఎవరూ ఊహించని పాత్రలే క్రైమ్స్ చేస్తుంటాయి. అలాంటి అవకాశం వస్తే నటిస్తా.

Exit mobile version