‘కంచరపాలెం’ మేకర్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘కొత్తపల్లిలో ఒక్కప్పుడు’ టీజర్‌కు టైమ్ ఫిక్స్

టాలీవుడ్‌లో క్లాసిక్ చిత్రంగా నిలిచిన వాటిలో ‘C/O కంచరపాలెం’ కూడా ఒకటి. ఎమోషనల్ కంటెంట్‌తో రియలిస్టిక్ కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఇప్పుడు మరోసారి వీరు చేతులు కలిపారు.

ప్రవీణ పరుచూరి ఈసారి ప్రొడ్యూసర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా మారి ‘‘కొత్తపల్లిలో.. ఒక్కప్పుడు’’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను రానా దగ్గుబాటితో కలిసి ఆమె ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డే్ట్ అయితే ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూలై 4న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో ఈ సినిమాలో నటీనటులు ఎవరు.. ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా.. అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ఏం జరిగిందో తెలియాలంటే ఈ టీజర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version