ఓటిటిలోకి ‘థగ్ లైఫ్’.. 25 లక్షలు ఫైన్ నిజమేనా?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “థగ్ లైఫ్”. నటుడు శింబు కూడా సాలిడ్ పాత్రలో నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలు నడుమ విడుదలకి వచ్చి భారీ ప్లాప్ గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మేకర్స్ ఈ సినిమాని 8 వారాల తర్వాతే ఓటిటిలో విడుదల చేస్తామని చెప్పారు.

కానీ థియేటర్స్ లో వచ్చాక ఫలితం బెడిసి కొట్టడంతో సౌత్ భాషలు వరకు నెట్ ఫ్లిక్స్ లో నెల లోపే ఇచ్చేస్తారని టాక్ వచ్చింది. మరి దీనిపైనే చర్చలు కూడా నెట్ ఫ్లిక్స్ చేస్తున్నారని తెలియగా ఇపుడు దీనిపై మరో అప్డేట్ కూడా వినిపిస్తుంది. దీని ప్రకారం అనుకున్న ఒప్పందం మారడంతో నెట్ ఫ్లిక్స్ వారే రివర్స్ లో చిత్ర యూనిట్ కి 25 లక్షలు ఫైన్ వేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి. అయితే హిందీ వెర్షన్ మాత్రమే యథావిధిగా 8 వారాల తర్వాతే వస్తుందట.

Exit mobile version